శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 21:13:37

ఢిల్లీలో కరోనా కల్లోలం

ఢిల్లీలో కరోనా కల్లోలం

న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం అంతగా కనిపించడం లేదు. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం ఆ రాష్ట్రంలో కొత్తగా 1,299 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 1,41,531 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

వైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ 15 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 4,059కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 1,27,124 మంది చికిత్సకు కోలుకున్నారని, 10,348 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఇవాళ 5,737 మందికి ఆర్టీపీసీఆర్/సీబీనాట్ / ట్రూనాట్ పరీక్షలు, 14,699 మందికి రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 11,20,318 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వ బులెటిన్ తెలిపింది.

తాజావార్తలు


logo