శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 17:24:39

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి

న్యూఢిల్లీ:  ఢిల్లీలో కరోనా ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది.  గతంలో రోజుకు 4వేలకు పైగా నమోదైన   కేసుల సంఖ్య  ప్రస్తుతం  వెయ్యి నుంచి 2 వేల మధ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,195 మందికి   పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మరో 27 మంది చనిపోయారు 

ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 1,35,598కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,705 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,20,930 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 3,963 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్కరోజే 1206 మంది కోలుకున్నారు.  


logo