బుధవారం 12 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 17:39:20

ఢిల్లీలో 10 వేల‌కు త‌గ్గిన యాక్టివ్ కేసులు

ఢిల్లీలో 10 వేల‌కు త‌గ్గిన యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీని గ‌త నాలుగు నెల‌లుగా ఉక్కిరిబిక్కిరి చేసిన క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడు కాస్త శాంతించింది. రోజురోజుకు న‌మోద‌య్యే కొత్త కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టింది. ఇటీవ‌లి వ‌ర‌కు రోజుకు సుమారు ఐదు వేల చొప్పున పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కేవ‌లం 1118 కొత్త కేసులు మ‌త్ర‌మే న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 1,36,716కు పెరిగింది. 

మొత్తం కేసుల‌లో 1,22,131 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 10,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఢిల్లీలో క‌రోనా మ‌ర‌ణాలు క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో మ‌రో 26 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,989కి చేరింది. ఢిల్లీ ఆరోగ్య‌శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.                  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo