మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 17:28:41

ఢిల్లీలో కొత్తగా 1,118 కరోనా కేసులు

ఢిల్లీలో కొత్తగా 1,118 కరోనా కేసులు

న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదువుతుండగా.. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో  1,118 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1201 మంది మహమ్మారి బారినుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 26 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు ఢిల్లీలో 1,36,716 మంది కరోనా బారినపడగా 1,22,131 మంది చికిత్సకు కోలుకున్నారు. 10,596 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 3,989 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బులిటెన్లో వెల్లడించింది. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 57,117 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 16,95,938 మంది కరోనా బారినపడగా 10,94,374 మంది చికిత్పకు కోలుకొని డిశ్చార్జి కాగా 5,65,103 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.


logo