శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 28, 2021 , 08:45:59

ఢిల్లీలో వందలోపే కరోనా కేసులు.. 9 నెలల్లో ఇదే ప్రథమం

ఢిల్లీలో వందలోపే కరోనా కేసులు.. 9 నెలల్లో ఇదే ప్రథమం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు వందలోపే నమోదయ్యాయి. ఇంత తక్కువగా నమోదవడం గత తొమ్మిది నెలల్లో ఇదే మొదటిసారని ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని ప్రాంతంలో నిన్న 96 పాజిటివ్‌ కేసులు, తొమ్మిది మరణాలు నమోదయ్యాయి. అదేవిధంగా 212 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఢిల్లీ మూడు విడుతలుగా కరోనా మహమ్మారి విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌ తర్వాత మొదటి సారిగా బుధవారంనాడు వందలోపు నమోదయ్యాయి. 

దేశంలో నిన్న 12,689 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 1,06,89,527కు చేరాయి. ఇందులో 1,03,59,305 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 1,53,724 మంది మరణించారు. దీంతో రికవరీరేటు 96.91 శాతానికి, మరణాల రేటు 1.65 శాతానికి చేరింది. 

VIDEOS

logo