శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 19:57:16

ఢిల్లీలో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

ఢిల్లీలో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు. రోజూ మూడు వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 3,827 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అక్క‌డ న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,64,450కి చేరింది. అయితే అంత‌కంటే ఎక్కువ సంఖ్య‌లో రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయి. 4,061 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఢిల్లీలో మొత్తం రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య కూడా 2,28,436కు చేరింది. 

ప్ర‌స్తుతం ఢిల్లీలో 30,867 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం కూడా 24 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్క‌డ న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5,147కు చేరింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo