బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 13:24:07

ఢిల్లీలో 11.4 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

ఢిల్లీలో 11.4 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 11.4 డిగ్రీలకు పడిపోయిందని, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కనిష్ఠ స్థాయి ఇదేనని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ నవంబర్ మొదటి వారంలో కనీసం 15 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ నమోదు చేస్తోంది. నవంబర్ చివరి వారం నాటికి 11 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. కనీస ఉష్ణోగ్రత తక్కువగా ఉండడానికి క్లౌడ్ కవర్ లేకపోవడమే ప్రధాన కారణమని ఐఎండీ ప్రాంతీయ కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ అన్నారు. కొండ ప్రాంతాల్లో ఎక్కువ హిమపాతం జరుగలేదని, కొండల్లో ఎక్కువ హిమపాతం జరుగలేదని, దీంతో ఆ ప్రాంతం నుంచి చల్లని గాలులు ఢిల్లీ వాతావరణాన్ని ప్రభావితం చేయలేకపోయాయన్నారు.

ఢిల్లీ 58 సంవత్సరాల తర్వాత అత్యంత చల్లని అక్టోబర్‌గా నిలిచింది. 1962లో 16.9 డిగ్రీలు నమోదు కాగా.. తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 17.2 డిగ్రీలు నమోదైంది. సాధారణంగా దేశ రాజధానిలో అక్టోబర్‌లో కనీస సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 19.1 డిగ్రీల సెల్సియస్. 2007 అక్టోబర్‌లో నగరంలో 17.5 డిగ్రీలు నమోదైంది. గురువారం 12.5 డిగ్రీలుగా రికార్డయింది. ఇది 26 సంవత్సరాల్లో అక్టోబర్‌లో తక్కువ ఉష్ణోగ్రత. ఐఎండీ డేటా ప్రకారం.. అక్టోబర్‌ 31, 1994న 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్టోబర్ 31, 1937న అత్యల్ప ఉష్ణోగ్రత (9.4 డిగ్రీల సెల్సియస్) నమోదైందని శ్రీవాస్తవ వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.