మంగళవారం 19 జనవరి 2021
National - Dec 20, 2020 , 07:57:34

గత నాలుగు నెలల్లో ఇదే అతితక్కువ

గత నాలుగు నెలల్లో ఇదే అతితక్కువ

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా అత్యధిక కేసులతో సతమతమవుతున్న ఢిల్లీకి కొంత ఊరట లభించింది. దేశ రాజధానిలో నిన్న పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గాయి. గత నాలుగు నెలల్లో ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కరోనా వ్యాప్తి రేటు 1.3 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. గడిచిన 5 రోజులుగా పాజిటివిటీ రేటు 2 శాతంలోపే ఉంటుంది. 

ఢిల్లీలో గడచిన 24 గంటల్లో  కొత్తగా 1,139 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 24 తరువాత (1061) ఇదే అత్యల్ప కేసుల సంఖ్య. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,15,914కి చేరింది. ఇందులో 10,251 మంది మరణించగా, మరో 10,358 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న కరోనా వల్ల మరో 32 మంది మృతి చెందారు. ఢిల్లీలో నిన్న 87,330 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 47,460 ఆర్టీ పీసీఆర్‌ టెస్టులు, 39,870 ర్యాపిడ్‌ టెస్టులు ఉన్నాయి.