గురువారం 02 జూలై 2020
National - May 25, 2020 , 14:38:39

ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్‌

ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్‌


హైద‌రాబాద్‌: ఢిల్లీలోని ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో 20 శాతం బెడ్‌ల‌ను కోవిడ్‌19 రోగుల‌కు రిజ‌ర్వ్ చేయాల‌ని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.  ప్రైవేటు హాస్పిట‌ళ్లు క‌రోనా పేషెంట్ల‌ను వెన‌క్కి పంపించ‌రాదు అని వార్నింగ్ ఇచ్చారు.  మొత్తం 117 హాస్పిట‌ళ్లు ఈ ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. కోవిడ్ చికిత్స కోసం నేటి నుంచి రెండు వేల బెడ్స్ అందుబాటులో ఉంటాయ‌న్నారు. క‌రోనా పేషెంట్‌కు చికిత్స అందించేందుకు నిరాక‌రించిన ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి ప్ర‌భుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  ప్ర‌భుత్వం ఆధీనంలో 4వేల బెడ్‌లు ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతానికి 1500 బెడ్స్ మాత్ర‌మే నిండి ఉన్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.logo