బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 18:44:24

ప్రైమరీ స్కూళ్లకు మార్చి 31 వరకు సెలవులు

ప్రైమరీ స్కూళ్లకు మార్చి 31 వరకు సెలవులు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ప్రైమరీ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మనీష్‌ సిపోడియా ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా, ముందు జాగ్రత్తగా ప్రైమరీ స్కూళ్లను ఈ ఏడాది మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ సెలవులు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ఎంసీడీ, ఎన్డీఎమ్‌సీ ప్రైమరీ స్కూళ్లకు వర్తించనున్నాయి. 

ప్రస్తుతం కరోనా వైరస్‌ 60 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు. సుమారు 90 వేల మందికి పైగా కరోనా సోకింది. భారత్‌లో 30 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 16 మంది ఇటలీ దేశస్థులు ఉన్నారు. 


logo
>>>>>>