మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 10, 2020 , 15:14:53

ఫిక్కీకి రూ.20 ల‌క్ష‌లు జ‌రిమానా

ఫిక్కీకి రూ.20 ల‌క్ష‌లు జ‌రిమానా

న్యూఢిల్లీ: ఢిల్లీ పొల్యూష‌న్ కంట్రోల్ క‌మిటీ (డీపీసీసీ) ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ (ఎఫ్ఐసీసీఐ- ఫిక్కీ)కి రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. ప‌ర్యావ‌ర‌ణ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కార‌ణంగా ఫిక్కీకి జ‌రిమానా విధించిన‌ట్లు డీపీసీసీ తెలిపింది. యాంటీ-స్మాగ్ గ‌న్‌లు ఉప‌యోగించ‌కుండా ఎలాంటి కూల్చివేత ప‌నుల‌ను కొన‌సాగించ‌డంగానీ, పునఃప్రారంభించ‌డంగానీ చేయ‌కూడ‌ద‌ని డీపీసీసీ ఇటీవ‌ల ఫిక్కీకి సూచించింది.

అయితే, డీపీసీసీ సూచ‌న‌ను ఖాత‌రు చేయ‌కుండా ఫిక్కీ ఢిల్లీలోని తాన్‌సేన్ మార్గ్‌లోని త‌న ప్రాజెక్టులో కూల్చివేత‌లు చేప‌ట్టింది. డీపీసీసీ సూచ‌న మేర‌కు యాంటీ-స్మాగ్ గ‌న్స్ ఏర్పాటు చేయ‌కుండానే ప‌నులు మొద‌లుపెట్టింది. దీంతో డీపీసీసీ ఫిక్కీకి జ‌రిమానా విధించింది. జ‌రిమానా రూ.20 ల‌క్ష‌ల‌ను 15 రోజులలోగా చెల్లించాల‌ని ఆదేశించింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.