గురువారం 04 జూన్ 2020
National - Feb 05, 2020 , 02:41:09

బుజ్జగింపుల సర్కారొద్దు

బుజ్జగింపుల సర్కారొద్దు
  • ఢిల్లీ ఓటర్లకు ప్రధాని మోదీ సూచన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుజ్జగింపులకు ప్రయత్నించే ప్రభుత్వం అవసరం లేదని, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఆర్టికల్‌ 370 రద్దు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలకు మద్దతు తెలిపే ప్రభుత్వం కావాలని ప్రధాని మోదీ తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ‘శత్రువులు మనపై దాడి చేయడానికి అవకాశం కల్పించే ప్రభుత్వం అక్కరలేదు. బుజ్జగింపులకు ప్రయత్నించే ప్రభుత్వం అవసరం లేదు. ఎవరైతే మన భద్రతా బలగాలను కించపర్చుతున్నారో అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి’ అని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం విద్వేష రాజకీయాలు చేస్తున్నదని, ఈ విషయం ఢిల్లీ వాసులందరికీ తెలుసునని పేర్కొన్నారు. కాబట్టి ఆప్‌ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.


logo