బుధవారం 03 జూన్ 2020
National - Apr 01, 2020 , 11:56:09

మ‌ర్క‌జ్ పెద్ద‌ల‌కు పోలీసుల వార్నింగ్‌.. వీడియో

మ‌ర్క‌జ్ పెద్ద‌ల‌కు పోలీసుల వార్నింగ్‌.. వీడియో

హైద‌రాబాద్‌: ఢిల్లీలోని నిజాముద్దీన్ ఇప్పుడు క‌రోనా వైర‌స్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. అక్క‌డ జ‌రిగిన మ‌ర్క‌జ్ స‌మావేశానికి హాజ‌రైన వేలాది మంది ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చెల్లాచెదుర‌య్యారు. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు వారిని ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డాయి. అయితే మార్చి 23వ తేదీన ఢిల్లీ పోలీసులు మ‌ర్క‌జ్ నిర్వ‌హించిన అక్క‌డ సీనియ‌ర్ స‌భ్యుల‌కు వార్నింగ్ ఇచ్చారు.  దేశంలో లాక్‌డౌన్ విధించార‌ని, బిల్డింగ్‌ను వెంట‌నే ఖాళీ చేయాల‌ని పోలీసులు వారిని కోరారు.  లాక్‌డౌన్ రూల్స్‌ను క‌చ్చితంగా పాటించాల‌ని హెచ్చ‌రించారు. సుమారు ఆరు మంది మ‌ర్క‌జ్ పెద్ద‌ల‌ను పోలీసుల రూమ్‌కు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ స‌మావేశాల‌కు వ‌చ్చిన 157 మంది విదేశీయుల‌ను కూడా క్వారెంటైన్‌కు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.  వేరువేరు మ‌సీదుల్లో ఉన్న‌వారు స్వ‌చ్ఛందంగా రావాల‌న్నారు. మ‌ర్క‌జ్ పెద్ద‌ల‌కు వార్నింగ్ ఇస్తున్న వీడియోను పోలీసులు విడుద‌ల చేశారు. ఇదే ఆ వీడియో. logo