సోమవారం 25 మే 2020
National - Apr 02, 2020 , 18:47:32

225 వలసదారులపై కేసులు..

225 వలసదారులపై కేసులు..

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైన వారు దేశంలో పలు రాష్ర్టాల్లో ఉండటంతో..అధికారులు వారి వివరాలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వలసదారులు గుంపులు గుంపులుగా ఢిల్లీలోని మజ్నూ కా తిలా గురుద్వారాలో తలదాచుకున్నారు.

స్థానిక అధికార యంత్రాంగం అనుమతి లేకుండా సామూహికంగా ఉండటంతో..పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. సుమారు 225 మంది వలసదారులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  మర్కజ్‌ మత ప్రార్థనల్లో పాల్గొని దేశంలోని అన్ని రాష్ర్టాలకు తిరిగి వెళ్లిపోయిన వారి వల్ల ఒక చైన్‌ లాగా కరోనా వ్యాప్తి చెందుతుంది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు. 


logo