ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 16:19:54

ఉద్యోగం ఉన్న‌ప్ప‌టికీ రూ. 85 దోపిడీ చేసిన దొంగ‌.. చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న పోలీసులు!

ఉద్యోగం ఉన్న‌ప్ప‌టికీ రూ. 85 దోపిడీ చేసిన దొంగ‌.. చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న పోలీసులు!

ప‌నీపాటా లేనివాళ్లు.. అల్లరి చిల్లరగా తిరిగే వాళ్లు దొంగతనం చేస్తే ఏమో అనుకోవచ్చు.  కానీ ఉద్యోగం ఉండి కూడా చిల్ల‌ర డబ్బుల కోసం దొంగతనం చేయడమే కాదు తుపాకీతో బెదిరించాడు. అదీ.. ఓ ఆటోడ్రైవర్‌ను. వినడానికి విడ్డూరంగా అనిపించినా.. చివరకు  పోలీసులు రంగంలోకి దిగి అతని ఆటకట్టించారు.   

ఢిల్లీలో ఇటీవల ఆటో డ్రైవర్‌ను గన్‌తో బెదిరించి రూ.85 దోపిడీ చేసిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గన్‌తో తిరుగుతున్న అతడిని పోలీసులు చుట్టుముట్టి లొంగిపోవాలని కోరారు. చేతిలో గ‌న్ ఉన్న అత‌ను మాట వింటాడా! ద‌గ్గ‌ర‌కు వ‌స్తే త‌న‌ని తాను కాల్చుకొని చ‌స్తానంటూ బెదిరిస్తాడు. దీంతో ఒక పోలీస్ అత‌న్ని మాట‌ల్లో పెట్టి ఇద్ద‌రు పోలీసులు వెనుక నుంచి వెళ్లి చేతిలోని గ‌న్‌ను లాగేసుకొని అదుపులోకి తీసుకుంటారు. ఇత‌ను ఏ దొంగో తెలుసా?  మెడిక‌ల్ రిప్ర‌జెంటేటివ్‌గా ప‌నిచేస్తున్న ద‌మ‌న్ అరోనా. వ‌య‌సు 24 ఏండ్లే. నెల‌వారి జీతం స‌రిపోవ‌ట్లేదేమో ఇలా సంపాదించుకుంటున్నాడంటూ నెటిజ‌న్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. 


logo