సోమవారం 08 మార్చి 2021
National - Jan 28, 2021 , 11:14:17

20 మంది రైతు సంఘాల‌ ప్ర‌తినిధుల‌కు నోటీసులు

20 మంది రైతు సంఘాల‌ ప్ర‌తినిధుల‌కు నోటీసులు

న్యూఢిల్లీ : గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిర్వ‌హించిన కిసాన్ ర్యాలీ హింసాత్మ‌కంగా మారిన విష‌యం విదిత‌మే. దీంతో ఢిల్లీ పోలీసులు 25 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశారు. తాజాగా 20 మంది రైతు ప్ర‌తినిధుల‌కు నోటీసులు పంపారు. కిసాన్ ర్యాలీలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై మూడు రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ రైతుల‌ను పోలీసులు ఆదేశించారు. నోటీసుల జాబితాలో యోగేంద్ర యాద‌వ్‌, బాల్‌దేవ్ సింగ్ సిర్సా, బల్బీర్ రాజేవాల్‌తో పాటు ప‌లువురు ఉన్నారు. ఇక టిక్రి స‌రిహ‌ద్దు వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

పోలీసుల‌కు అమిత్ షా ప‌రామ‌ర్శ‌

కిసాన్ ర్యాలీలో గాయ‌ప‌డ్డ పోలీసులు ఢిల్లీలోని రెండు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ పోలీసుల‌ను ఇవాళ ఉద‌యం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప‌రామ‌ర్శించారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి వివ‌రాల‌ను వైద్యుల‌ను అడిగి హోంమంత్రి తెలుసుకున్నారు.  

VIDEOS

logo