మిల్కీ బ్యూటీ తమన్నా ఓ వైపు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు డిజిటల్లో సత్తా చాటుతుంది. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌లలో నటించిన తమన్నా ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌కు సైన్ చేసింది. ఇక వీటితో పాటు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. మాస్టర్ చెఫ్ అనే పేరుతో తమన్నా వంటల కార్యక్రమం చేయనుండగా, ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
తాజాగా మాస్టర్ చెఫ్ షోకి సంబంధించి ప్రోమో షూట్ చేశారట. ఆ షూట్‌కి సంబంధించిన స్టిల్‌ని తమన్నా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో విజయ్ సేతుపతి కూడా కనిపించడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. మాస్టర్ చెఫ్ అంటూ తెలుగులో రాబోతోన్న ఈ షోలో విజయ్ సేతుపతితో తమన్నా రచ్చ చేయనున్నారు. మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో షూటింగ్లో విజయ్ సేతుపతి ఉండటం నాకెంతో సంతోషంగా ఉంది.. ఇదో కుకింగ్ షో, షూటింగ్ స్టార్ట్ కాకముందు ఇలా ఎంజాయ్ చేశామంటూ తమన్నా ఓ ఫోటోను షేర్ చేశారు. త్వరలోనే ప్రోమోను కూడా విడుదల చేయనున్నారు.