బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 14:54:00

ఆగ‌స్టు 15 వ‌ర‌కు డ్రోన్లు, ఇత‌ర ఎగిరే వ‌స్తువుల నిషేధం

ఆగ‌స్టు 15 వ‌ర‌కు డ్రోన్లు, ఇత‌ర ఎగిరే వ‌స్తువుల నిషేధం

ఢిల్లీ : భద్రతా చర్యల్లో భాగంగా నేటి నుంచి ఆగస్టు 15 వరకు డ్రోన్లు, ఇత‌ర వైమానిక‌ వ‌స్తువుల‌ను ఎగుర‌వేయ‌డాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు. పారా గ్లైడ‌ర్స్‌, పారా మోటార్స్‌, హ్యాంగ్ గ్లైడ‌ర్స్‌, యూఏవీలు, యూఏఎస్‌లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌, రిమోట్‌తో ప‌నిచేసే ఎయిర్‌క్రాఫ్ట్‌, హాట్ ఎయిర్ బెలూన్స్‌, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌, క్వాడ్‌కాప్ట‌ర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి పారా జంపింగ్ వంటి వాటిని నిషేదిస్తూ ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్.ఎన్‌. శ్రీ‌వాస్త‌వ నేడు ఉత్త‌ర్వులు జారీచేశారు. ఎవ‌రైనా నిషేధాన్ని ఉల్లంఘిస్తే ప్ర‌వ‌ర్తిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హుల‌న్నారు. క్రిమిన‌ల్స్‌, సంఘ‌వ్య‌తిరేక శ‌క్తులు, ఉగ్ర‌వాదులు సాధార‌ణ ప్ర‌జ‌లు, ప్ర‌ముఖుల భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగిస్తార‌న్న స‌మాచారం మేర‌కు ఈ నిషేదాన్ని విధిస్తున్న‌ట్లు తెలిపారు.


logo