శుక్రవారం 03 జూలై 2020
National - May 06, 2020 , 19:00:00

అమ్మాయిల‌ న‌గ్న చిత్రాలు.. ఇన్‌స్టాగ్రామ్ గ్రూపు అడ్మిన్ అరెస్టు

అమ్మాయిల‌ న‌గ్న చిత్రాలు.. ఇన్‌స్టాగ్రామ్ గ్రూపు అడ్మిన్ అరెస్టు

హైద‌రాబాద్‌: ఢిల్లీలో అమ్మాయిల‌ న‌గ్న చిత్రాల‌ను షేర్‌ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ అడ్మిన్‌ను అరెస్టు చేశారు. ఆ గ్రూపు పేరు బోయిస్ లాక‌ర్ రూమ్‌. అయితే ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఈ గ్రూపు ఆగ‌డాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.  ఇన్‌స్టా గ్రూపు చేసిన చాటింగ్‌కు సంబంధించి స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. మైన‌ర్ల‌ను గ్యాంగ్ రేప్ చేయాల‌ని ఆ గ్రూపు స‌భ్యులు చాటింగ్ చేశారు. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రెండు రోజుల్లోనే పోలీసులు ఇన్‌స్టా అడ్మిన్‌ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన విద్యార్థి .. నోయిడా స్కూల్‌లో చ‌దువుతున్నాడు. ఈ ఏడాడే అత‌ను 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యాడు. ఏప్రిల్‌లో అత‌ను ఈ గ్రూపు స్టార్ట్ చేశాడు.  తొలుత కొంద‌ర్ని అత‌ను యాడ్ చేశాడు. ఆ త‌ర్వాత వాళ్లు మ‌రికొంత మంది మిత్రుల్ని క‌లిపారు.

ఈ గ్రూపుకు సంబంధించిన ప‌ది మందిని పోలీసులు గుర్తించారు. దాంట్లో ఆరుగురి వ‌య‌సు 18 ఏళ్లు దాటింది. ఇవాళ కూడా పోలీసులు ఆ గ్రూపుతో లింకు ఉన్న మ‌రో న‌లుగుర్ని విచారించారు. గ్రూపులో ఉన్న మైన‌ర్‌ అబ్బాయిల‌ను జువెనైల్ యాక్ట్ ప్ర‌కారం ఇంటి నుంచే విచారిస్తున్న‌ట్లు డీసీపీ అయినేశ్ రాయ్ తెలిపారు. ఈ గ్రూపులో పాల్గొన్న‌వారి వివ‌రాలు ఇవ్వాల‌ని ఇన్‌స్టాగ్రామ్ సంస్థ‌కు కూడా ఢిల్లీ పోలీసు సైబ‌ర్ క్రైం సెల్ ఓ లేఖ రాసింది. అయితే ఆ సంస్థ ఇంకా పోలీసుల‌కు ఎటువంటి స‌మాధానం ఇ్వ‌లేదు.  విచార‌ణ‌లో పాల్గొవాల‌ని మ‌రో 21 మందికి కూడా పోలీసులు లేఖ రాశారు. 

బోయిస్ లాక‌ర్ రూమ్ గ్రూపు ఇన్‌స్టాలో అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్‌లు, మార్ఫింగ్ పిక్స్‌ను షేర్ చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.  గ్రూపులో మొత్తం 51 మంది స‌భ్యులు ఉన్నారు. ఎక్కువ శాతం ద‌క్షిణ ఢిల్లీ, నోయిడా విద్యార్థులు ఉన్న‌ట్లు స‌మాచారం. అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు చేసేందుకు వాడిన క‌మ్యూనికేష‌న్ డివైస్‌ల‌ను సీజ్ చేశామ‌ని, వాటిని ఫోరెన్సిక్‌కు పంపిన‌ట్లు పోలీసులు తెలిపారు.  బోయిస్ లాక‌ర్ రూమ్ గ్రూపును ఆన్‌లైన్ నేరం కింద విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర మంత్రి దేబ‌శ్రీ చౌద‌రి డిమాండ్ చేశారు.  


logo