బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 12:25:01

క్యూలైన్ లో హెల్మెట్లు, సాక్సులు, బాటిళ్లు..

క్యూలైన్ లో హెల్మెట్లు, సాక్సులు, బాటిళ్లు..

ఢిల్లీ: మ‌ద్యం కొనుగోలు చేసేందుకు మందు బాబులు షాపులు తెర‌వ‌క‌ముందే దుకాణాల ముందుకొచ్చి క్యూ క‌డుతున్నారు. మద్యం ప్రియ‌లు మందు కొనుక్కొనేదాకా తిరిగి వెళ్లే ప్ర‌సక్తే లేద‌న్న‌ట్లుగా చాలా ఓపిగ్గా తెల్ల‌వారుజాము నుంచే షాపు ముందు నిల‌బ‌డి..ఎపుడు దుకాణం తెరుస్తారా..? అని ఎదురుచూస్తున్నారు.

ఢిల్లీలోని వ‌సంత్ విహార్ ఏరియాలో ఓ మ‌ద్యం షాపు ద‌గ్గ‌ర‌ సామాజిక దూరం పాటించేలా గుండాలు గీశారు. కొంత‌మంది క్యూలైన్ లో నిల‌బ‌డేందుకు బ‌దులుగా త‌మ హెల్మెట్లు, వాట‌ర్ బాటిళ్లు, సాక్సులు..లైన్ లో వ‌రుస క్ర‌మంలో పెట్టుకున్నారు. మ‌ద్యం కోసం మందు బాబులు షాపుల వ‌ద్ద ఎలా ఉన్నారో ఈ ఫొటోల‌ను చూస్తే అర్థ‌మవుతుంది.  
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo