శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 17:57:53

కేజ్రీవాల్‌ ‘ఉగ్రవాది’ కాదని ప్రజలు నిరూపించారు..

కేజ్రీవాల్‌ ‘ఉగ్రవాది’ కాదని ప్రజలు నిరూపించారు..

న్యూఢిల్లీ: ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉగ్రవాది కాదని, నిజమైన దేశభక్తుడని ప్రజలు నిరూపించారని రాజిందర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన ఆప్‌ నేత రాఘవ్‌ చధా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రాఘవ్‌ చధా మీడియాతో మాట్లాడుతూ..కేజ్రీవాల్‌ యావత్‌ దేశ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. కేజ్రీవాల్‌ చేస్తున్న పనులే ఆయన దేశభక్తిని చాటుతున్నాయి. బీజేపీ చూపుతున్నది దేశభక్తి కాదని రాఘవ్‌చధా ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 63 స్థానాలను గెలుచుకుని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఉగ్రవాది అంటూ బీజేపీ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 


logo