శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 08:49:22

విదేశాల నుంచి వచ్చిన 35 వేల మందిని చెక్‌ చేయనున్న ఢిల్లీ అధికారులు

విదేశాల నుంచి వచ్చిన 35 వేల మందిని చెక్‌ చేయనున్న ఢిల్లీ అధికారులు

న్యూఢిల్లీ : విదేశాల నుంచి వచ్చిన వారిని చెక్‌ చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి ఢిల్లీకి 35 వేల మంది చేరుకున్నట్లుగా సమాచారం. వీరంతా తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. వీరంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారో లేదో తనిఖీ చేయాల్సిందిగా సీఎం కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వీరితో కాంటాక్ట్‌లో ఉన్నవారు సైతం రెండు వారాలు ఐసోలేషన్‌ పాటించాల్సిందిగా సూచించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని ఇప్పటికే ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నేటి నుంచి మార్చి 31 వరకు ఢిల్లీ సైతం లాక్‌డౌన్‌ ప్రకటించింది. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా 14,641 మంది మృతిచెందారు. భారత్‌లో 396 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 7గురు చనిపోయారు. ఢిల్లీలో ప్రజా రవాణాను బంద్‌ చేశారు. రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. ప్రజలు గుంపులుగా చేరడంపై పోలీసులు నిషేదాజ్ఞలు విధిస్తున్నారు. 


logo