శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 23, 2020 , 20:18:51

రేపు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

 రేపు  కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరుగనున్న సమావేశాల్లో.. ఫిబ్రవరి 24న  (రేపు)కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.  ఆ తర్వాత స్పీకర్‌ ను ఎన్నుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఫిబ్రవరి 25న  సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.  గత అసెంబ్లీలో స్పీకర్‌ గా పనిచేసిన రామ్‌ నివాస్‌ గోయెల్‌నే మరోసారి స్పీకర్‌ గా ఎన్నుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 62 స్థానాలను కైవసం చేసుకుని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 


logo