బుధవారం 08 జూలై 2020
National - Jun 26, 2020 , 17:31:03

క‌రోనా నుంచి కోలుకున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి

క‌రోనా నుంచి కోలుకున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ కు క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ను శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు డిశ్చార్జి చేసే అవ‌కాశం ఉంది. ఆరోగ్య మంత్రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో.. ప్లాస్మా చికిత్స చేయ‌డంతో ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డింద‌ని వైద్యులు తెలిపారు. ఐసీయూ నుంచి జూన్ 22న సాధార‌ణ వార్డుకు జైన్ ను త‌ర‌లించారు.

ఈ నెల 17న స‌త్యేంద‌ర్ జైన్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిలో చేరారు. తీవ్ర జ్వ‌రం, శ్వాస‌సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసీయూకు త‌ర‌లించి చికిత్స అందించారు. 

అయినా పరిస్థితి మెరుగుప‌డక‌పోవ‌డంతో స‌త్యేంద‌ర్ జైన్‌కు ప్లాస్మా చికిత్స అందించారు. ప్లాస్మా చికిత్స అనంత‌రం ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డింది. జ్వ‌రం త‌గ్గ‌డంతోపాటు, శ్వాస‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగైంది. 


logo