శనివారం 11 జూలై 2020
National - Apr 28, 2020 , 11:30:40

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. మంత్రిపై పోలీసులు ఫైర్‌

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. మంత్రిపై పోలీసులు ఫైర్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికమైపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఓ మంత్రి మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారు.

ఢిల్లీ ఆహార మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌.. నిన్న సాయంత్రం సదార్‌ బజార్‌కు 25 మందిని వెంటేసుకుని వచ్చారు. దీంతో మంత్రి కాన్వాయ్‌ను పోలీసులు ఆపారు. ఓ సీనియర్‌ పోలీసు అధికారి మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ మీ ప్రభుత్వంలోని వ్యక్తే.. ఆయన మా మనిషి కాదు.. ఆయన చెప్పినట్లు వినండి. మీ పని మీరు చేసుకుంటే బాగుంటుంది.. తమ పనుల్లో జోక్యం చేసుకోవద్దు. ఈ రద్దీ మీ వల్లే అని మంత్రికి పోలీసు ఆఫీసర్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. సామాజిక దూరం పాటించాలని మంత్రి వెంట వచ్చిన వారికి పోలీసులు సూచించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రిపై చర్యలు తీసుకోవడానికి ఢిల్లీ పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 


logo