గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 13:43:33

ట్రాక్టర్‌ పరేడ్‌ : మెట్రో స్టేషన్ల మూసివేత

ట్రాక్టర్‌ పరేడ్‌ : మెట్రో స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పోలీసులు, రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రైతు నిరసనలతో దేశ రాజధాని అట్టుడకడంతో ఢిల్లీ మెట్రో పలు స్టేషన్లను మూసివేసింది. సింఘు బోర్డర్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించిన రైతులు పోలీస్‌ బారికేడ్లను తోసివేసి ముందుకు సాగారు.

కొన్ని చోట్ల సిమెంట్‌ బారికేడ్లను రైతులు తమ చేతులతోనే పెకిలించి ముందుకు పోతుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతులు బారికేడ్లను తొలగించడంతో పోలీసులు వారిపై భాష్పవాయుగోళాలను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ సహా దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

VIDEOS

logo