శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 19:00:47

ఇలా స్కిప్పింగ్‌ చేయాలంటే గట్స్‌ ఉండాలి..!

ఇలా స్కిప్పింగ్‌ చేయాలంటే గట్స్‌ ఉండాలి..!

న్యూఢిల్లీ: అతడికి ఏదైనా వెరైటీగా చేయడం అలవాటు. ఇటీవలే రోలర్‌స్కేటింగ్‌లో ఫీట్లుచేసి గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కాడు. ఇప్పుడు అతడి దృష్టి స్కిప్పింగ్‌పై పడింది. తాడు సహాయంతో వివిధ రకాలుగా స్కిప్పింగ్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నది. 

ఢిల్లీకి చెందిన జోరవర్ సింగ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి విభిన్నరీతిలో స్కిప్పింగ్‌ చేశాడు. కింద ఇద్దరుండగా వారి భుజాలపై ఇద్దరు కూర్చున్నారు. వారు అలాగే స్కిప్పింగ్‌ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. దీనికి పిరమిడ్‌ వీల్‌ ఫ్రీస్టైల్‌ జంప్‌ రోప్‌ అని పేరు పెట్టారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పెట్టగా 16,800 మంది వీక్షించారు. 1500 కి పైగా లైక్స్‌ వచ్చాయి.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.