మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 15:56:52

కార్పొరేషన్‌ ఉద్యోగులకు జీతాల కోసం మేయర్ల నిరసన

కార్పొరేషన్‌ ఉద్యోగులకు జీతాల కోసం మేయర్ల నిరసన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మూడు కార్పొరేషన్లకు చెందిన ముగ్గురు మేయర్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం ముందు బైఠాయించారు. కార్పొరేషన్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంపై నిరసన తెలిపారు. దీనిపై తమతో సంప్రదింపులు జరుపాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తాము అక్కడి నుంచి వెళ్లబోమని అన్నారు. మరోవైపు మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆ ముగ్గురు మేయర్లను కలుస్తానని చెప్పారు. కార్పొరేషన్‌ ఉద్యోగులకు జీతాల చెల్లింపు సమస్య గురించి వారితో మాట్లాడతానని తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.