సోమవారం 01 జూన్ 2020
National - May 24, 2020 , 11:10:25

బుల్లెట్‌ భర్త చెవిలో నుంచి దూసుకెళ్లి.. భార్య మెడకు తాకింది

బుల్లెట్‌ భర్త చెవిలో నుంచి దూసుకెళ్లి.. భార్య మెడకు తాకింది

న్యూఢిల్లీ : ఇద్దరు భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న స్వల్ప వివాదం కాల్పుల దాకా తీసుకువచ్చింది. ఫరీదాబాద్‌కు చెందిన భార్యాభర్తలిద్దరూ.. గురుగ్రామ్‌లోని రామ్‌పూర్‌ ఏరియాలో గత కొన్నేళ్ల నుంచి నివాసముంటున్నారు. 34 ఏళ్ల వ్యక్తి భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. చెకప్‌ కోసం ఆమెను భర్త శుక్రవారం ఆస్పత్రికి కారులో తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన భర్త.. తన వద్ద ఉన్న తుపాకీతో తన చెవిలో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

తన చెవిలో నుంచి దూసుకెళ్లిన బుల్లెట్‌.. పక్క సీట్లో ఉన్న భార్య మెడకు తాకింది. దీంతో ఇద్దరికి తీవ్ర రక్తస్రావమైంది. అటు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి.. భార్యాభర్తలిద్దరిని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితులిద్దరిని ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించారు. భార్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధి లేకపోవడంతో బతకడం భారంగా మారిన నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.


logo