గురువారం 28 మే 2020
National - May 21, 2020 , 12:13:30

కరోనా నివారణ మందు పేరిట భార్యకు విషం

కరోనా నివారణ మందు పేరిట భార్యకు విషం

న్యూఢిల్లీ : ఓ భర్త తన భార్యకు కరోనా వైరస్‌ నివారణ మందు పేరిట విషమిచ్చాడు. ఎందుకంటే తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించడమే కారణం. ఈ ఘటన ఢిల్లీలోని అలీపూర్‌ ఏరియాలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన ప్రదీప్‌(42)కు భార్య ఉంది. ఆమె స్థానికంగా ఉన్న హోంగార్డుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ప్రదీప్‌కు తెలియడంతో.. ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలతో తన భార్యను చంపించేందుకు ఒప్పందం చేసుకున్నాడు.

కరోనా వైరస్‌ నివారణ మందు పేరిట భార్యతో పాటు మరో ఇద్దరికి విషం ఇవ్వాలని మహిళలకు ప్రదీప్‌ ముందే చెప్పాడు. ఆ ఇద్దరు మహిళలు హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ మాదిరిగా నటించారు. మొత్తానికి భార్య ఇంటికి చేరుకుని వారికి విషమిచ్చారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా కోలుకున్నారు. 

ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరు చేసిన నేరాన్ని అంగీకరించారు. పోలీసులు ప్రదీప్‌ను అరెస్టు చేశారు. 


logo