మంగళవారం 19 జనవరి 2021
National - Jan 06, 2021 , 16:47:56

ఆవులేగ‌పై అమానుషం.. ఢిల్లీలో వ్య‌క్తి అరెస్ట్‌

ఆవులేగ‌పై అమానుషం.. ఢిల్లీలో వ్య‌క్తి అరెస్ట్‌

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. ఓ వ్య‌క్తి ఆవుదూడను తీవ్రంగా గాయ‌ప‌ర్చాడు. అనంత‌రం తీవ్ర గాయాల‌తో ప‌డిపోయిన ఆవుదూడ‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా పారిపోయాడు. తూర్పు ఢిల్లీలోని మండ‌వాలీ ఏరియాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. గాయ‌ప‌డ్డ‌ ఆవుదూడను చికిత్స కోసం సంజ‌య్‌గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. మండ‌వాలి ఏరియాకు చెందిన క‌మ‌ల్‌సింగ్ చేతిలో డాక్యుమెంట్ల‌తో రోడ్డుపై వెళ్తుండ‌గా త‌ల్లి వెంట ఉన్న ఓ ఆవు లేగ అత‌ని చేతికి త‌గిలింది. చేతిలోని డాక్యుమెంట్లు రోడ్డుపై ప‌డిపోయాయి. దాంతో క‌మ‌ల్ సింగ్‌లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. రోడ్డుపైన ప‌డ్డ డాక్యుమెంట్ల‌ను తీసుకోకుండానే ఆవులేగ‌ను తీవ్రంగా కొట్టాడు. కాలితో ఇష్ట‌మొచ్చిన‌ట్లు త‌న్నాడు. అనంత‌రం డాక్యుమెంట్ల‌ను తీసుకుని మ‌ళ్లీ దాడి చేశాడు. రాళ్ల‌తో కొట్టాడు. 

క‌మ‌ల్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఆవులేగ లేవ‌లేని స్థితిలో కింద ప‌డిపోయింది. అయితే క‌మ‌ల్ సింగ్ అదేమీ ప‌ట్టించుకోకుండా త‌న దారిన తాను వెళ్లిపోయాడు. అయితే అత‌ను దూడ‌పై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. వాటిని ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి. ఆ వీడియో ఆధారంగా కొంద‌రు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. గాయ‌ప‌డ్డ అవుదూడ‌ను చికిత్స కోసం ఆస్ప‌త్రిలో చేర్చారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.