మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 20:23:37

మెట్రో స్టేషన్ బయట భారీగా క్యూకట్టిన ప్రయాణికులు

మెట్రో స్టేషన్ బయట భారీగా క్యూకట్టిన ప్రయాణికులు

న్యూఢిల్లీ: మెట్రో స్టేషన్‌ బయట ప్రయాణికులు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వెలుపల అర కిలోమీటరుకుపైగా బారులు తీరారు. మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు తమ వంతు కోసం వేచి ఉన్నారు. కరోనా నేపథ్యంలో మెట్రో స్టేషన్‌ ప్రవేశం వద్ద థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజేషన్ తప్పని సరి చేశారు. దీంతో మెట్రో స్టేషన్‌ సిబ్బంది ప్రతి ఒక్కరిని థర్మల్‌ గన్స్‌తో శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తున్నారు. దీనితోపాటు హ్యాండ్‌ శానిటైజేషన్‌ అనంతరం ప్రయాణికులను మెట్రో స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆదివారం కావడంతో ప్రయాణికుల రద్దీ కూడా బాగా పెరిగింది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అక్కడి ప్రజలు పెద్దగా లెక్కచేయడం లేదు. దీపావళి పండుగ నేపథ్యంలో షాపుల వద్ద జన రద్దీ బాగా పెరిగింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.