శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 15:36:34

ఇన్‌ఫెక్షన్‌ లేని వస్ర్తాన్ని రూపొందించిన ఐఐటీ విద్యార్థి

ఇన్‌ఫెక్షన్‌ లేని వస్ర్తాన్ని రూపొందించిన ఐఐటీ విద్యార్థి

న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో బెడ్‌లు, ఇతర అవసరాల కోసం వస్ర్తాలను (ఫాబ్రిక్‌) తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఆస్పత్రుల్లో రోగుల కోసం ఉపయోగించే వస్ర్తాలను ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఎప్పటికపుడు మారుస్తుంటారు. ఆస్పత్రుల్లో వాడే వస్ర్తాలతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఇన్‌ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫాబ్రిక్‌ను తయారుచేశారు. ఐఐటీ ఢిల్లీ విద్యార్థి యతీ గుప్తా ప్రొఫెసర్‌ సామ్రాట్‌ ఉపాధ్యాయ్‌ నేతృత్వంలో..ఇన్‌ఫెక్షన్‌ రహిత నూలు వస్ర్తాలను రూపొందించారు.

మెడికల్‌ టెక్నాలజీ ఆధారంగా టెక్స్‌టైల్‌ కెమికల్‌ ప్రాసెసింగ్‌ విధానంలో బాక్టీరియాలు, వైరస్‌లను నిరోధించే సామర్థ్యం ఉన్న వస్ర్తాన్ని అభివృద్ధి చేసిన యతీగుప్తా చెప్పారు. తాము అభివృద్ధి చేసిన ఇన్‌ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫాబ్రిక్‌..2 గంటల వ్యవధిలో 99 శాతం వ్యాధికారక క్రిములను చంపేస్తుందన్నారు. ఆస్పత్రులను మరింత సురక్షితంగా చేయడంలో భాగంగా ఈ వస్ర్తాన్ని డెవలప్‌ చేసినట్లు తెలిపారు. ఈ వస్ర్తాన్ని బెడ్‌షీట్లు, డాక్టర్లు, నర్సులు, రోగులకు  వేసే యూనిఫామ్స్‌ కోసం వాడవచ్చిన..పూర్తి సురక్షితమైందని తెలిపారు. 


logo