సోమవారం 06 జూలై 2020
National - Jun 25, 2020 , 14:47:11

చైనా జాతీయులకు ఆతిథ్యం ఇవ్వం!

చైనా జాతీయులకు ఆతిథ్యం ఇవ్వం!

న్యూఢిల్లీ : ఇకపై దేశ రాజధానిలో చైనా జాతీయులకు ఆతిథ్యం ఇవ్వమని ఢిల్లీ హోటల్, గెస్ట్‌హౌస్‌ ఓనర్స్ అసోసియేషన్ గురువారం ప్రకటించింది. ఈ నెల 15న గాల్వాన్‌ లోయలో చైనా సైనికుల దాడిలో ఓ కర్నల్‌ సహా 20 మంది భారత సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో చైనా దురాక్రమణను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మా హోటళ్లలో చైనా ప్రజల కోసం ఎలాంటి బుకింగ్‌లను అనుమతించబోమని ఢిల్లీ హోటల్, గెస్ట్‌హౌస్‌ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించిందని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహేంద్ర గుప్తా పేర్కొన్నారు. మన దేశానికి హాని తలపెట్టాలనుకునే వారిని హోటళ్లలో బస చేయడానికి ఎలా అనుమతిస్తామని ఆయన ప్రశ్నించారు. అలాగే కరోనా మహమ్మారి నేపథ్యంలో హోళ్ల నిర్ణయంతో వచ్చే ఆర్థిక ఇబ్బందులపై మాట్లాడుతూ.. అన్ని అన్నికంటే పెద్దదని పేర్కొన్నారు.


logo