బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 13:00:01

ఢిల్లీలో మళ్లీ భూకంపం.. నెలలో ఇది నాలుగోసారి

ఢిల్లీలో మళ్లీ భూకంపం.. నెలలో ఇది నాలుగోసారి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, నెలరోజుల వ్యవధిలో ఢిల్లీలో భూకంపం సంభవించడం ఇది నాలుగోసారి. రిక్టర్ స్కేలుపై 2.2 తీవ్రత నమోదైన ఈ భూకంపం.. వాయవ్య ఢిల్లీలో శుక్రవారం ఉదయం 11.28 గంటలకు చోటుచేసుకుందని సిస్మాలజీ సెంటర్ ప్రకటించింది. ఈ నెల మొదట్లో కూడా ఈశాన్య ఢిల్లీలోని వాజీపూర్ ఏరియాలో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా, ఇదే ప్రాంతంలో ఏప్రిల్ 12, 13 తేదీల్లో కూడా 3.5, 2.7  తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.  


logo