శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 13:54:28

ఢిల్లీ ప్ర‌భుత్వ ఆదేశాల‌పై హైకోర్టు స్టే

ఢిల్లీ ప్ర‌భుత్వ ఆదేశాల‌పై హైకోర్టు స్టే

న్యూఢిల్లీ: ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్ర‌భుత్వానికి అక్క‌డి హైకోర్టులో చుక్కెదురైంది. క‌రోనా వైరస్‌ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో 80 శాతం ఐసీయూ ప‌డ‌క‌ల‌ను కొవిడ్‌-19 రోగుల కోసం రిజ‌ర్వ్ చేయాలని సూచిస్తూ.. అర‌వింద్ కేజ్రివాల్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు ఇచ్చిన ఆదేశాల‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తాము త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చేవ‌ర‌కు స్టే కొన‌సాగుతుంద‌ని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్ర‌భుత్వ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ ప్రైవేటు ఆస్ప‌త్రులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్గు ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీచేసింది.