గురువారం 26 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 14:15:41

క‌రోనా టెన్ష‌న్‌.. ఢిల్లీ స‌ర్కార్‌పై హైకోర్టు ఆగ్ర‌హం

క‌రోనా టెన్ష‌న్‌.. ఢిల్లీ స‌ర్కార్‌పై హైకోర్టు ఆగ్ర‌హం

హైద‌రాబాద్‌:  ఇటీవ‌ల ఢిల్లీలో వ‌రుస‌గా క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి.  ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర హైకోర్టు.. ఆమ్ ఆద్మీ స‌ర్కార్‌పై మండిప‌డింది.  గ‌త 18 రోజుల నుంచి మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుంటే.. ప్ర‌భుత్వం ఎందుకు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టలేద‌ని కోర్టు పేర్కొన్న‌ది.  జ‌స్టిస్ హిమా కోహ్లీ, సుబ్ర‌మ‌ణియం ప్ర‌సాద్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.  కోవిడ్‌19 వేళ‌.. వివాహ వేడుక‌ల‌కు 50 మంది క‌న్నా ఎక్కువ మందికి ఎలా అనుమ‌తి క‌ల్పిస్తున్నార‌ని కోర్టు ప్రశ్నించింది.  కోర్టు జోక్యం చేసుకునే వ‌ర‌కు ఎందుకు వేచి చూడాల‌ని ఆప్ స‌ర్కాన్‌ను హైకోర్టు నిల‌దీసింది. న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి వైర‌స్ కేసులు పెరుగుతున్నాయ‌ని తెలుసు, మ‌రెందుకు ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌లేదు. ఇన్నాళ్లు ఎందుకు వేచి ఉన్నారు, ఈ స‌మ‌యంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా అని ధ‌ర్మాస‌నం కేజ్రీ స‌ర్కార్‌ను ప్ర‌శ్నించింది. కోవిడ్ నియంత్ర‌ణ‌లో ఢిల్లీ స‌ర్కార్ విఫ‌ల‌మైన‌ట్లు ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. మ‌రోవైపు ఇవాళ సీఎం కేజ్రీవాల్‌.. క‌రోనా కేసుల అంశంపై అఖిల ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశారు.