గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 15:09:38

1984 అల్లర్లు పునరావృతం కావొద్దు..

1984 అల్లర్లు పునరావృతం కావొద్దు..

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ అల్లర్ల ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఉదయం పోలీసులకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. విచారణకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ అల్లర్లపై కోర్టు విచారణ జరిపింది.

దేశ రాజధానిలో 1984 నాటి తరహాలో అల్లర్లు పునరావృతం కావొద్దు అని హెచ్చరించింది. పూర్తి స్థాయిలో పౌరులకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రభావిత ప్రాంతాలను ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం సందర్శించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్క బాధితుడి వద్దకు చేరుకోవాల్సిన సమయం ఇది అని కోర్టు తెలిపింది. ప్రతి ఒక్కరికి జడ్‌ సెక్యూరిటీలా రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. బాధితులు, వారి కుటుంబాలను ఉన్నతాధికారులు పరామర్శించాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఐబీ ఆఫీసర్‌ మృతి చెందడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఐబీ ఆఫీసర్‌ చనిపోవడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది. 

షెల్టర్లు ఇవ్వాలి

అల్లర్లకు భయపడి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లడానికి భయపడితే వారికి షెల్టర్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. షెల్టర్లలో బాధితులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. మృతుల కుటుంబాలతో మాట్లాడి అంత్యక్రియలు సజావుగా సాగేలా చూడాలని కోర్టు చెప్పింది. హెల్ప్‌లైన్లు, హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం చేయాలి. క్షతగాత్రుల వద్దకు అంబులెన్స్‌లు సురక్షితంగా చేరేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 


logo
>>>>>>