గురువారం 02 జూలై 2020
National - Jun 29, 2020 , 15:04:48

ఢిల్లీ కోర్టుల్లో జూలై 15 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు

ఢిల్లీ కోర్టుల్లో జూలై 15 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ దేశాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగ‌తున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. దేశంలోనూ ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. గ‌త రెండు రోజుల నుంచి రోజుకు సుమారుగా 20 వేల కొత్త కేసులు న‌మోదయ్యాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా ర‌క్క‌సి విస్తృతి ఇంకా ఎక్కువ‌గా ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్టు సోమ‌వారం మ‌ధ్యాహ్నం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. 

ఢిల్లీ హైకోర్టు స‌హా, దాని స‌బార్డ‌నేట్ కోర్టుల్లో విధుల‌పై ఇప్ప‌టికే అమ‌ల్లో ఉన్న స‌స్పెన్ష‌న్‌ను జూలై 15 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు స్ప‌ష్టంచేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విస్త‌రిస్తున్నందున‌ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న‌ది. స‌స్పెన్ష‌న్ పొడిగింపు నేప‌థ్యంలో ఢిల్లీలోని హైకోర్టు, స‌బార్డినేట్ కోర్టుల్లో జూలై 15 వ‌ర‌కు విచార‌ణకు రావాల్సిన అన్ని కేసులు వాయిదా ప‌డిన‌ట్లేన‌ని తెలిపింది. అత్య‌వ‌స‌ర కేసుల‌పై వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది.   


logo