గురువారం 26 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 15:26:41

ఛ‌ట్ పూజ‌కు అనుమ‌తి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

ఛ‌ట్ పూజ‌కు అనుమ‌తి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా చెరువులు, నదులు మొద‌లైన బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఛ‌ట్ పూజలు జరుపరాదంటూ ఇటీవ‌ల‌ ఢిల్లీ ప్రభుత్వం విధించిన నిషేధంపై జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 20న బహిరంగ ప్రదేశాల్లో ఛట్‌ పూజలకు అనుమతించేది లేదంటూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. 

బుధ‌వారం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం దాన్ని కొట్టివేసింది. డీడీఎంసీ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖ‌లైన ఈ పిటిషన్‌ విచారణ అర్హత లేనిదిగా భావిస్తూ కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తులు హైమా కోహ్లి, సుబ్రమణియం ప్రసాద్‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.