శుక్రవారం 05 జూన్ 2020
National - May 18, 2020 , 16:13:53

పదేళ్లుగా జైలులోనే..తక్షణమే విడుదలకు కోర్టు ఆదేశం

పదేళ్లుగా జైలులోనే..తక్షణమే విడుదలకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు విదేశీయులను తక్షణమే విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇద్దరు విదేశీయులను పోలీసులు 2010 మే 15న ఎన్డీపీఎస్ యాక్ట్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్)కింద అరెస్ట్ చేశారు. అయితే వారిద్దరు అప్పటి నుంచి పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. ఇద్దరూ పదేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసుపై విచారణ సందర్భంగా..వారిద్దరిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదై..అరెస్టైన వారికి పదేళ్లలోపు ఉండకుండా శిక్ష విధిస్తారు. నేర తీవ్రతను బట్టి శిక్షను 20 ఏళ్లకు కూడా పెంచే అవకాశముంటుంది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo