శుక్రవారం 10 జూలై 2020
National - Jun 17, 2020 , 20:24:54

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్ కు పాజిటివ్

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్ కు పాజిటివ్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ కు కరోనా (కోవిడ్-19)వైరస్ సోకింది.  తీవ్ర జ్వరం, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటంతో ఆయనకు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్ గా నిర్దారణ అయింది. 55 సంవత్సరాల సత్యేంద్రజైన్ ప్రస్తుతం అదే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే ఢిల్లీలోముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు, అతిశి, విశేష్ రవి, రాజ్ కుమార్ ఆనంద్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. logo