శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 11:25:04

క‌రోనా నుంచి కోలుకుని.. విధుల్లో చేరిన ఆరోగ్య మంత్రి

క‌రోనా నుంచి కోలుకుని.. విధుల్లో చేరిన ఆరోగ్య మంత్రి

న్యూఢిల్లీ: నెల రోజుల త‌ర్వాత ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర ‌జైన్ విధుల్లో చేరారు. గ‌త నెల‌లో క‌రోనా బారిన ప‌డిన స‌త్యేంద్ర ‌జైన్ కోలుకున్నార‌ని, ఆయన ఈ రోజు విధుల్లో చేరార‌ని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో క‌రోనా ప‌రిస్థితులను తెలుసుకునేందుకు ఆయ‌న నిత్యం క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించేవార‌ని, వైద్య సిబ్బంది, రోగుల‌తో స‌మావేశ‌మ‌య్యేవార‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌కు క‌రోనా సోకింద‌ని తెలిపారు. క‌రోనా నుంచికోలుకున్న ఆయ‌న‌, నెల రోజుల తర్వాత విధుల్లో చేరుతున్నార‌ని వెల్ల‌డించారు. స‌‌త్యేంద్ర‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాన‌ని తెలిపారు. 

గ‌త నెల 17, 19 తేదీల్లో రెండు సార్లు స‌త్యేంద్ర జైన్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఢిల్లీలోని మ్యాక్స్ ద‌వాఖాన‌లో అడ్మిట్ అయ్యారు. క‌రోనా త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆయ‌న ప్లాస్మా తెర‌పీ చేయించుకున్నారు. త‌ర్వాత ఆయ‌న‌ను ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని రాజివ్‌గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, తీవ్ర జ్వ‌రంతో ఇబ్బంది ప‌డ‌టంతో మళ్లీ మ్యాక్స్ ద‌వాఖానకు వెళ్లారు. అనంత‌రం ఆయ‌న కోలుకున్నారు. క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించ‌గా నెగెటివ్ వ‌చ్చింది. గ‌త నెల‌రోజులుగా ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియా ఆరోగ్య‌శాఖ బాధ్య‌త‌లు చూస్తున్నారు.

ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు 1,22,793 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 3628 మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో తాజాగా 1211 మందికి క‌రోనా సోకింది.  logo