గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 15:43:10

కోలుకుంటున్న ఢిల్లీ ఆరోగ్య‌మంత్రి

కోలుకుంటున్న ఢిల్లీ ఆరోగ్య‌మంత్రి

న్యూఢిల్లీ: ఢిల్లీ హెల్త్ మినిస్ట‌ర్ స‌త్యేంద‌ర్‌ జైన్ ఆరోగ్యం కాస్త మెరుగుప‌డింది. ప్లాస్మా థెర‌పీ చేస్తుండ‌టంతో ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డుతున్న‌ద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం స‌త్యేంద‌ర్‌కు జ్వ‌రం పూర్తిగా త‌గ్గింద‌ని, శ్వాస ప‌రిస్థితి కూడా మెరుగుప‌డింద‌ని వారు వెల్ల‌డించారు. ఈ ఒక్క‌రోజు చూసి రేపు ఆయ‌నను ఐసీయూ నుంచి జ‌న‌ర‌ల్ వార్డుకు త‌ర‌లిస్తామ‌ని వైద్యులు చెప్పారు. 

ఈ నెల 17న స‌త్యేంద‌ర్ జైన్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిలో చేరారు. అనంత‌రం ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌నను ఐసీయూకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు జైన్ ఆరోగ్యం మెరుప‌డ‌టంతో రేపు ఆయ‌న‌ను జ‌న‌ర‌ల్ వార్డుకు త‌ర‌లించ‌నున్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.                                           logo