శనివారం 11 జూలై 2020
National - Jun 17, 2020 , 14:18:39

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రికి మరోసారి కరోనా పరీక్షలు

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రికి మరోసారి కరోనా పరీక్షలు

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు బుధవారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. నిన్న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో.. ఆయన నిన్న రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

గత వారం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా జ్వరం, గొంతు నొప్పి రావడంతో.. కరోనా టెస్టులు చేయించుకున్న విషయం విదితమే. కానీ కేజ్రీవాల్‌కు కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయితే నిన్న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి సత్యేందర్‌ జైన్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, సీఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.logo