సోమవారం 06 జూలై 2020
National - Jun 19, 2020 , 15:20:27

కృత్రిమశ్వాస‌పై ఢిల్లీ ఆరోగ్యమంత్రి‌!

కృత్రిమశ్వాస‌పై ఢిల్లీ ఆరోగ్యమంత్రి‌!

న్యూఢిల్లీ: ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్‌గా తేలడంతో ఆస్ప‌త్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌కు వైద్యులు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. జైన్‌కు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ మ‌రింత ముద‌ర‌డంతో స‌రిగా శ్వాస తీసుకోలేకపోతున్నార‌ని, అందుకే కృత్రిమ శ్వాస అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. బుధ‌వారం నిర్వ‌హించిన క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో జైన్‌కు పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిలో చేరారు. రెండు రోజులుగా తీవ్ర జ్వ‌రం, శ్వాస స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఢిల్లీలో క‌రోనా ఉధృతంగా ఉన్న‌ స‌మ‌యంలో ఆరోగ్య‌మంత్రి ఆస్ప‌త్రి పాలు కావ‌డంతో..  ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా ఆరోగ్యశాఖ బాధ్య‌త‌లు చూస్తున్నారు.                                 


logo