గురువారం 09 జూలై 2020
National - Jun 20, 2020 , 10:45:28

ఢిల్లీ ఆరోగ్య మంత్రికి ప్లాస్మా థెర‌పీ!

ఢిల్లీ ఆరోగ్య మంత్రికి ప్లాస్మా థెర‌పీ!

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ ‌ ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే ఉన్న‌ద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు జ్వ‌రం పూర్తిగా త‌గ్గింద‌ని, అయితే శ్వాస స‌మ‌స్య తీవ్రంగా ఉండ‌టంతో గ‌త 24 గంట‌లుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు. ప‌రిస్థితి తీవ్ర‌త దృష్ట్యా  ఆయ‌నకు ప్లాస్మా థెర‌పీ నిర్వ‌హించాల‌ని కూడా వైద్యులు నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. సాధార‌ణంగా క‌రోనా వైర‌స్ తీవ్ర‌త బాగా ముదిరి వెంటిలేట‌ర్‌పై ఉన్నవారికే మాత్ర‌మే ప్లాస్మా థెర‌పీ నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ఉన్న‌ది. 

ఈ నేప‌థ్యంలో స‌త్యేంద‌ర్ జైన్‌కు ప్లాస్మా థెర‌పీ నిర్వ‌హించాల‌ని వైద్యులు నిర్ణ‌యించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తుండ‌‌టం ప‌రిస్థితి తీవ్రత‌ను తెలుపుతున్న‌ది. జైన్‌కు ఈ నెల 17న క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మొద‌టి రోజు జ్వ‌రంతో బాధ‌ప‌డ్డ జైన్ రెండో రోజు శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది ప‌డ‌టంతో ఆక్సిజ‌న్ స‌పోర్టుపై ఉంచారు. ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా మార‌డంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.     logo