నిరసనకారులను సీఎం ఇంటి వద్ద నుంచి తరలించండి: కోర్టు

న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్న వారిని అక్కడి నుంచి తరలించాలని పోలీసులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జిల్లా మేజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.13 వేల కోట్ల నిధులను ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేయాలని బీజేపీ పాలిత కార్పొరేషన్ల మేయర్లు డిమాండ్ చేస్తున్నారు. 22 మంది బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఈ నెల 7 నుంచి సీఎం అరవింద్ క్రేజీవాల్ అధికార నివాసం బయట నిరసన చేస్తున్నారు. కాగా సివిల్ లైన్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ దీనిపై ఢిల్లీ హైకోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలు చేసింది. నిరసనకారులు రోడ్డును మూసివేయడంతో తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపించింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ సచ్దేవ ఈ పిల్‌పై శుక్రవారం విచారణ జరిపారు. కాగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నిరసనకారులకు పలుసార్లు తెలిపామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. సెక్షన్ 144తోపాటు డీడీఎంఏ ఆదేశాలు అమలులో ఉన్న విషయాన్ని కూడా చెప్పామన్నారు. అయితే నిరసనల కోసం రామ్‌లీలా మైదానం, జంతర్‌మంతర్ వంటి ప్రాంతాలు ఉండగా అధికార నివాసాల ప్రాంతాల్లో నిరసనలు చేయడం తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. వెంటనే వారిని అక్కడి నుంచి తరలించాలని, జిల్లా మేజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు