గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 18:28:52

ఢిల్లీలో ప్ర‌జా ర‌వాణా ప్రారంభించేందుకు స‌న్నాహాలు

ఢిల్లీలో ప్ర‌జా ర‌వాణా ప్రారంభించేందుకు స‌న్నాహాలు

న్యూఢిల్లీ: లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో దేశ‌రాజ‌ధానితోపాటు అన్ని రాష్ట్రాల్లో ప్రజా ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించి పోయిన విష‌యం తెలిసిందే. మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతుంది. అయితే ఢిల్లీలో ప్ర‌జా ర‌వాణాను ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది.

ఢిల్లీ ర‌వాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ మాట్లాడుతూ..ర‌వాణా శాఖ అధికారుల‌తో చ‌ర్చిస్తున్నాం. క‌రోనా నేప‌థ్యంలో బ‌స్సులు న‌డిపిస్తే ప్ర‌యాణికుల భ‌ద్ర‌త కోసం  ప్రోటోకాల్ ను సిద్దం చేయాల‌ని అధికారుల‌కు సూచించాం. బ‌స్సులు న‌డిపించేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాం. కేంద్ర‌ప్ర‌భుత్వం విడుద‌ల చేసే మార్గ‌ద‌ర్శ‌కాల కోసం ఎదురుచూస్తున్నామ‌న్నారు.  ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo