శనివారం 04 జూలై 2020
National - Jun 21, 2020 , 07:36:52

ఢిల్లీలో కరోనా లొల్లి

ఢిల్లీలో కరోనా లొల్లి

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒకవైపు కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తుంటే మరోవైపు కేజ్రీవాల్‌ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. కరోనా రోగులు ఐదురోజులు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఎల్జీ అనిల్‌బైజాల్‌ జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. దేశమంతా ఒక విధానం ఉంటే ఢిల్లీలో అందుకు భిన్నంగా ఎందుకు ఆదేశాలిచ్చారని సీఎం కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. వివాదం ముదరటంతో ఎల్జీ తన ఆదేశాలను ఉపసంహరించారు. 

మరోవైపు ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం సెలవులను రద్దుచేసింది. ఢిల్లీలో శనివారం ఒక్కరోజే కొత్తగా 3,137 కేసులు నమోదు కావటంతో మొత్తం కేసులు 53,116కు చేరాయి. కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ప్రైవేటు దవాఖానలు కూడా సిద్ధం చేసినా బడ్లు సరిపోవటంలేదు. దాంతో ఇటీవలే రైల్వే కోచ్‌లను కూడా తాత్కాలిక క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చారు. 


logo